- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రేక్షకుల బద్ధకం వల్లే సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి.. సంచలన నోట్ విడుదల చేసిన తాప్సీ
బాలీవుడ్ నటి తాప్సీ పన్ను(Taapsee Pannu) తన లేటెస్ట్ మూవీ ‘అస్సీ’ (Assi) ప్రమోషన్లలో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

దిశ, సినిమా: బాలీవుడ్ నటి తాప్సీ పన్ను(Taapsee Pannu) తన లేటెస్ట్ మూవీ ‘అస్సీ’ (Assi) ప్రమోషన్లలో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హిందీ సినిమాల్లో మంచి కథలు రావడం లేదని విమర్శించే వారు, అసలైన కథలతో వచ్చే సినిమాలను థియేటర్లలో చూసి ఆదరించాలని ఆమె కోరారు. దర్శకుడు అనుభవ్ సిన్హా(Anubhav Sinha)తో తాప్సీ చేస్తున్న మూడో సినిమా ‘అస్సీ’. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ముల్క్’, ‘థప్పడ్’ చిత్రాలు సామాజిక అంశాలపై బలమైన ప్రభావం చూపాయి. ఇప్పుడు ‘అస్సీ’ ద్వారా దేశంలో జరుగుతున్న అత్యాచార కేసులు, న్యాయవ్యవస్థలోని లోపాలను ప్రశ్నించబోతున్నారు. సినిమా విడుదలకు ఒక వారం ముందుగానే వివిధ నగరాల్లో స్పెషల్ స్క్రీనింగ్స్ నిర్వహిస్తున్న సందర్భంగా తాప్సీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక నోట్ షేర్ చేసింది.
‘‘హిందీ పరిశ్రమలో వాస్తవిక కథలు లేవని విమర్శిస్తూ మనం ముసుగులో దాక్కోవద్దు. అద్భుతమైన కథలను థియేటర్లకు తీసుకురావడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నప్పుడు, ప్రేక్షకుల 'బద్ధకం' వల్ల అవి ఫెయిల్ అవ్వకూడదు. ప్రపంచ సినిమాతో మనం పోటీ పడాలంటే, ముందుగా మన దేశీ కథలను మనం ఆదరించాలి’’ అని ఫైర్ అయింది. ‘‘మనం మౌనంగా ఉంటే భవిష్యత్తులో మంచి సినిమాలు రాకుండా పోతాయని, ప్రతిభ ఉన్న సినిమాలకు మన గొంతుక తోడవాలి. ఈ సినిమాలో మా కథనంపై మాకు నమ్మకం ఉంది. మీరు కూడా థియేటర్లకు వచ్చి మంచి సినిమాలకు మద్దతు ఇవ్వండి" అని కోరింది. తాప్సీ నటిస్తున్న ఈ సినిమా ఒక సాధారణ కల్పిత కథ కాదు.
భారతదేశంలో రోజుకు సగటున 80 అత్యాచార కేసులు నమోదవుతున్నాయనే భయంకరమైన వాస్తవం ఆధారంగా ఈ కోర్టు రూమ్ డ్రామాను రూపొందించారు. ‘అస్సీ.. ఆ రాత్రి ఆమె ఇంటికి చేరుకోలేదు’ అనే క్యాప్షన్‌తో విడుదలైన టీజర్ ఇప్పటికే గుండెలను పిండేస్తోంది. ఇందులో తాప్సీ 'రావి' అనే ఒక పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా, రేవతి, కణి కుసృతి కీలక పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 20, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.






