- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీరమల్లు ప్రమోషన్స్ మరీ ఇంత నీచమా.. కండోమ్స్, కుక్క ఫుడ్ ప్యాకెట్‌పై దర్శనమిచ్చిన పోస్టర్స్..ఫ్యాన్స్ ఫైర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu).

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu). ఈ సినిమాని క్రిష్ కొంతభాగం తెరకెక్కించగా.. మిగిలినది ప్రొడ్యూసర్ రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. పవన్ ఇందులో చారిత్రక యోధుడిగా మునుపెన్నడూ చూడని శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో పవర్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తుండగా..బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, పూజా పొన్నాడ, అనసూయ, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం.ఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మిస్తున్నారు.
‘హరిహర వీరమల్లు’ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. అయితే ఇప్పటికే పలుమార్లు ఈ చిత్రం వాయిదా పడిన విషయం తెలిసిందే. మొత్తానికి జులై 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నారు. తొలి భాగం ‘హరి హర వీరమల్లు: పార్ట్ 1- స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. త్వరలోనే ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా జరగబోతుంది.
ఈక్రమంలో.. మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉండాలి కానీ ఇంకా సైలెంట్‌గా ఉండటంతో పలువురు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మళ్లీ వాయిదా వేస్తారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, కొంతమంది సినిమా ప్రమోషన్స్ ఇంకా కనిపించలేదని కండోమ్స్ ప్రాకెట్స్‌పై, డాగ్స్ ఫుడ్ ప్యాకెట్స్‌పై క్రీమ్‌పై, వాటర్ బాటిల్‌పై వీరమల్లు పోస్టర్లను పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ పోస్టులు నెట్టింట ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు కొందరు నవ్వుకుంటుండగా.. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు. లింక్






