- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘బ్యాండ్ మేళం’ సినిమా నుంచి రాజమ్మ స్పెషల్ గ్లింప్స్ విడుదల చేసిన మూవీ టీమ్
‘రాజమ్మ’ అనే మధ్యతరగతి అమ్మాయి పాత్రలో నటిస్తోంది. పక్కా లోకల్ అల్లరి పిల్లగా, మధ్యతరగతి ఇంటి అమ్మాయిగా ఆమె చేస్తున్న అల్లరి చేష్టలు ఈ వీడియోలో హైలైట్‌గా నిలిచాయి.

దిశ, సినిమా: గత ఏడాది విడుదలైన ‘కోర్ట్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆ సినిమాలో రోషన్(Roshan), శ్రీదేవి(Sridevi)ల మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ హిట్ జోడీ ఇప్పుడు మళ్ళీ జతకడుతుండటం విశేషం. ‘బ్యాండ్ మేళం’(Band Melam) అనే ఆసక్తికరమైన టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా సతీష్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా.. మేకర్స్ హీరోయిన్ శ్రీదేవి పాత్రను రివీల్ చేస్తూ ఒక స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో శ్రీదేవి ‘రాజమ్మ’ అనే మధ్యతరగతి అమ్మాయి పాత్రలో నటిస్తోంది. పక్కా లోకల్ అల్లరి పిల్లగా, మధ్యతరగతి ఇంటి అమ్మాయిగా ఆమె చేస్తున్న అల్లరి చేష్టలు ఈ వీడియోలో హైలైట్‌గా నిలిచాయి. అందరినీ తన ప్రేమతో ఆకట్టుకుంటూ, అల్లరితో అలరించే రాజమ్మ పాత్రకు సోషల్ మీడియాలో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
శ్రీదేవి లుక్స్, ఎనర్జీ చూస్తుంటే ఈ సినిమాతో ఆమె మరో హిట్ కొట్టడం ఖాయమనిపిస్తోంది. కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. ప్రతి అప్‌డేట్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ముఖ్యంగా రోషన్-శ్రీదేవిల హిట్ కాంబినేషన్ మళ్ళీ వెండితెరపై మ్యాజిక్ చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ‘బ్యాండ్ మేళం’ మార్చి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. సమ్మర్ సీజన్‌కు ముందే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా నిలిచిపోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.






