Kriti Shetty: నయనతార నిర్మాతగా మూవీ.. హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

by sudharani |
Kriti Shetty: నయనతార నిర్మాతగా మూవీ.. హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
X

దిశ, సినిమా: లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార ప్రజెంట్ నిర్మాతగా ఓ మూవీ చేస్తుంది. తన భర్త విఘ్నేష్ శివన్ రైటర్ అండ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అనే టైటిల్‌తో తెరెక్కుతున్న ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తుండగా.. కృతి శెట్టి హీరోయిన్‌గా అలరించనుంది. తాజాగా ఈ మూవీ నుంచి అప్‌డేట్ ఇచ్చారు నయన్ అండ్ విఘ్నేష్.

ఇందులో నుంచి ఇప్పటికే ప్రదీప్ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేసిన టీమ్.. ఇప్పుడు కృతి శెట్టి ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. ఈ లుక్స్‌లో కృతి శెట్టి.. రెండు జడలతో యానిమేషన్ బొమ్మలా ఎంతో క్యూట్‌గా కనిపిస్తుంది. ఇక విఘ్నేష్ అయితే.. కృతి శెట్టిని పరిచయం చేస్తూ ‘అందం- టాలెంట్ కలిగిన ఒక స్వీట్ బకెట్ లాంటి ఈ అమ్మాయిని మా చిత్రంలోకి తీసుకోవడం సంతోషంగా ఉంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చి షేర్ చేశాడు. ప్రజెంట్ ఈ రెండు పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.



Next Story

Most Viewed