- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘థమా’ సినిమా అప్డేట్‌తో హైప్ పెంచిన మూవీ మేకర్స్.. షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన బ్యూటీ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) ఇటీవల ఛావా, కుబేర వంటి చిత్రాలతో వరుస హిట్స్ సాధించింది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) ఇటీవల ఛావా, కుబేర వంటి చిత్రాలతో వరుస హిట్స్ సాధించింది. ప్రస్తుతం అదే ఫామ్‌లో భాషతో సంబంధం లేకుండా భారీ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. ఇన్నాళ్లూ లవ్ స్టోరీస్‌లో నటించిన నేషనల్ క్రష్ హారర్ మూవీతో భయపెట్టేందుకు సిద్ధమవుతోంది. త్వరలో ‘థమా’ (thama)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా, మూవీ మేకర్స్ రష్మిక మందన్నా క్యారెక్టర్‌కు సంబంధించిన లుక్ విడుదల చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇందులో ఈ భామ తడాకా పాత్రలో నటిస్తున్నట్లు తెలుపుతూ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఇందులో గ్రీన్ కలర్ గౌన్ ధరించిన రష్మిక ఫ్రీ హెయిర్‌తో కళ్లతో కాటుక పెట్టుకుని చేతులను ఓ పొజిషన్‌లో పెట్టి కనిపించింది.
ఇక ఈ పోస్ట్‌కు ‘‘థమా అప్డేట్ ఆగస్టు 19న ఉదయం 11:11 గంటలకు రాబోతుంది. ఈ దీపావళికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్స్‌లో రక్తపు ప్రేమకథను అందిస్తుంది’’ అనే క్యాప్షన్ చేశారు. కాగా.. ఈ సినిమాకు ఆదిత్య సర్పోట్దార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మడాక్స్ ఫిల్మ్స్, దినేష్ విజన్ ప్రజెంట్స్ బ్యానర్స్‌పై అమర్ కౌశిక్, దినేష్ విజన్ నిర్మిస్తున్నారు. ఇందులో అయుష్మాన్ ఖురానా(Ayushmann Khurrana) అలోక్ పాత్రలో నటిస్తున్నాడు. నవాజుద్దీన్ సిద్ధిఖీ అంధేరే కా బాద్‌షా యక్షాసన్ పాత్రలో కనిపించనుండగా.. పరేశ్ రావల్ రామ్ బాలాజీ గోయల్‌గా చేస్తున్నాడు. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబృందం ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్లు ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతున్నాయి.






