- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘తెలుసు కదా’ సినిమా టీజర్ అప్డేట్ ఇచ్చిన మూవీ మేకర్స్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్ (ట్వీట్)
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda)ఇటీవల ‘జాక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda)ఇటీవల ‘జాక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ మూవీ బాక్సాఫీసు వద్ద హిట్ అందుకోలేకపోయింది. అయినప్పటికీ హిట్ ఫ్లాప్ అని ఆలోచించకుండా సిద్దు జొన్నలగడ్డ వరుస సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి(Srinithi Shetty), రాశిఖన్నా (Raashi Khanna)ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తెలుసు కదా’(telusu kada). వైవా హర్ష కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నీరజ కోన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని పీపుల్ మీడియా బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, టీజీ కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. అక్టోబర్ 17న థియేటర్స్‌లోకి రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్. తాజాగా, ‘తెలుసు కదా’ చిత్రబృందం ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ రాబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ సినిమా టీజర్ సెప్టెంబర్ 11న ఉదయం 11:11 గంటలకు విడుదల కాబోతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా సిద్దు జొన్నలగడ్డ దూరంగా ఉండగా.. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ముగ్గురు బాల్కనీలో నిల్చొని సరదాగా మాట్లాడుకుంటున్న పోస్టర్ షేర్ చేసి క్యూరియాసిటీ పెంచారు. ఈ పోస్ట్‌కు ‘‘ప్రేమించడానికి జీవితం నీకు రెండు ఆప్షన్లు ఇస్తుంది.. లవ్ యూ2’’ అనే క్యాప్షన్ జత చేశారు.
Read More..
ఇంకా రెండు సర్‌ప్రైజ్‌లు దాచి ఉంచాం.. ‘మిరాయ్’ మూవీపై హైప్ పెంచేస్తున్న తేజా సజ్జా కామెంట్స్






