‘ఓజీ’ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన మూవీ మేకర్స్.. అగ్ని తుఫాన్ రాబోతుందంటూ హైప్ పెంచుతున్న పోస్ట్

by Mallepaka Hamsa |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న భారీ ప్రాజెక్ట్స్‌లో ‘ఓజీ’ (OG)ఒకటి.

‘ఓజీ’ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన మూవీ మేకర్స్.. అగ్ని తుఫాన్ రాబోతుందంటూ హైప్ పెంచుతున్న పోస్ట్
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న భారీ ప్రాజెక్ట్స్‌లో ‘ఓజీ’ (OG)ఒకటి. సుజిత్(sujith) దర్శకత్వంలో రాబోతున్న ఈ పాన్ ఇండియా మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ డ్రామా చిత్రంగా వస్తుండగా.. దీనిని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవర్ స్టార్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan) హీరోయిన్‌గా నటిస్తుండగా.. అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ, శ్రియా రెడ్డి కీలక పాత్రలో కనిపించనున్నారు.అయితే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కొంత పూర్తి కాగా.. మధ్యలో బ్రేక్ పడింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంలో షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ‘ఓజీ’ చిత్రం కోసం అభిమానులే కాకుండా సినీ సెలబ్రిటీలు సైతం వెయిట్ చేస్తున్నారు. అప్డేట్స్ అయినా ఇవ్వాలని మూవీ టీమ్‌ను రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే పలు పోస్టులు క్రియేట్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ‘ఓజీ’ ఓ సాంగ్ రాబోతున్నట్లు పలు వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా, ఈ విషయంపై స్పందించిన మూవీ టీమ్ పవర్ స్టార్ అభిమానులకు ‘ఓజీ’ భారీ గుడ్ న్యూస్ వెల్లడించింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ఆగస్టు 2న రాబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక ఇందులో క్యాసెట్‌పై ఓజీ పోస్టర్లు షేర్ చేశారు. దీనికిపై ఫైర్ తుఫాను రాబోతుందని రాసి ఉండగా..దానిపై ఎరుపు రంగు పాము పాకుతున్నట్లు కనిపించింది. ఇక ఈ పోస్ట్‌కు ‘‘అతను కోపంలో పుట్టి, పోరాటానికే కట్టబడ్డాడు. చివరి పేజీ రాయడానికి తిరిగి వచ్చాడు. అగ్ని తుఫాన్ రాబోతుంది సిద్ధంగా ఉండండి’’ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అది చూసిన ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేస్తోంది.

Next Story