రక్తపాతంలో టాక్సిక్ వేట.. టీజర్ రిలీజ్ తేదీ ప్రకటించిన మూవీ మేకర్స్

by Mallepaka Hamsa |

మంచు కురుస్తున్న ప్రాంతంలో యశ్ చాలా కూల్‌గా ఆల్కహాల్ తాగుతూ కనిపిస్తున్నారు. కానీ ఆయన ముందు మాత్రం రక్తం నదిలా పారుతోంది.

రక్తపాతంలో టాక్సిక్ వేట.. టీజర్ రిలీజ్ తేదీ ప్రకటించిన మూవీ మేకర్స్
X

దిశ, సినిమా: కేజీఎఫ్ సెన్సేషన్ రాకింగ్ స్టార్ యష్(Yash), బాక్సాఫీస్ వద్ద తన అసలు సిసలు విశ్వరూపం చూపించడానికి ‘టాక్సిక్’ (Toxic) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రతి అప్‌డేట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. తాజాగా, ఈ సినిమా టీజర్ అప్డేట్ రాబోతున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ టీజర్‌ను ఫిబ్రవరి 20న (రేపు) ఉదయం 9:35 గంటలకు విడుదల చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. టీజర్ అప్‌డేట్ కోసం వదిలిన పోస్టర్ చూస్తుంటే గూస్‌బంప్స్ వచ్చేలా ఉంది. మంచు కురుస్తున్న ప్రాంతంలో యశ్ చాలా కూల్‌గా ఆల్కహాల్ తాగుతూ కనిపిస్తున్నారు. కానీ ఆయన ముందు మాత్రం రక్తం నదిలా పారుతోంది. ఈ విజువల్ చూస్తుంటే సినిమాలో యాక్షన్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థమవుతోంది. మత్తులో ఉన్న రాకీ భాయ్ టీజర్‌తో రక్తపాతం మొదలెట్టబోతున్నారని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది.

‘పెద్దల కోసం ఒక అద్భుత కథ’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్రం, 1970ల నాటి గోవా డ్రగ్ మాఫియా నేపథ్యంలో సాగనుంది. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హ్యూమా ఖురేషి వంటి స్టార్ హీరోయిన్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో యష్ మునుపెన్నడూ చూడని విధంగా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై కొన్ని వివాదాలు నడిచినప్పటికీ, టీజర్ అప్‌డేట్‌తో వాటన్నిటికీ ఫుల్‌స్టాప్ పెట్టేశారు. కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే నెల మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Next Story