- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షూటింగ్ పూర్తి కాకుండానే సినిమా లీక్.. షాకింగ్ విషయాలు వెల్లడించిన శ్రీవిష్ణు
ఒకరోజు ఉదయం నిర్మాత ఫోన్ చేసి అసలు విషయం చెప్పగానే తాను ఒక్కసారిగా షాక్‌కు గురైనట్లు తెలిపారు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu )తన విభిన్నమైన కథా చిత్రాలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే ఆయన, తాజాగా నటించిన ‘విష్ణు విన్యాసం’ (vishnu vinyasam)చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే, ఈ సినిమా విడుదల వెనుక ఉన్న ఒక భయంకరమైన నిజాన్ని శ్రీవిష్ణు తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ చిత్రాన్ని ఇంత హడావిడిగా విడుదల చేయడానికి గల కారణాలను శ్రీవిష్ణు వివరిస్తూ.. ‘‘అసలు డిసెంబర్ నెలలోనే ఈ సినిమాకు సంబంధించిన ఫుటేజ్ లీక్ అయింది. ఒకరోజు ఉదయం నిర్మాత ఫోన్ చేసి ఈ విషయం చెప్పగానే తాను ఒక్కసారిగా షాక్‌కు గురైనట్లు తెలిపారు. సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకముందే సీన్లు బయటకు రావడం టీమ్ అందరినీ తీవ్ర ఆందోళనకు గురిచేసిందని అన్నారు.
దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, విషయం బయటకు తెలిస్తే సినిమాకు నష్టం జరుగుతుందని భావించి చిత్ర బృందం ఈ విషయాన్ని రహస్యంగా ఉంచినట్లు తెలిపారు. అయితే పైరసీ ముఠా కేవలం సీన్లను లీక్ చేయడమే కాకుండా, సినిమా ఫుటేజ్ కోసం నిర్మాతను కూడా విపరీతంగా బ్లాక్ మెయిల్ చేశారని శ్రీవిష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చిత్రం రిలీజ్ అయ్యే ముందు రోజు వరకు ఈ బెదిరింపులు కొనసాగాయని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ధైర్యం కోల్పోతారని, కానీ తమ నిర్మాత మాత్రం చాలా మొండిగా నిలబడి, ఎదురుదాడి చేస్తూ సినిమాను విడుదల చేయడానికి సిద్ధపడ్డారని శ్రీవిష్ణు ప్రశంసించారు. లీక్ అయిన ఫుటేజ్ వల్ల సినిమా కథ దెబ్బతినకుండా ఉండటానికి స్క్రిప్ట్‌లో కూడా కొన్ని కీలక మార్పులు చేయాల్సి వచ్చిందని శ్రీవిష్ణు చెప్పారు. షూటింగ్ పెండింగ్‌లో ఉన్నప్పటికీ, అందరం డే అండ్ నైట్ కష్టపడి అనుకున్న సమయానికి పూర్తి చేశామని అన్నారు.
కేవలం 10 రోజుల ప్రమోషన్ టైమ్ మాత్రమే ఉన్నా, టీమ్ మొత్తం సపోర్ట్‌గా నిలబడి పైరసీ భూతం బయటకు రాకుండా అడ్డుకోగలిగామని తెలిపారు. ఈ లీకేజీ వ్యవహారం చెన్నై నుంచి జరిగిందని శ్రీవిష్ణు స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, ప్రస్తుతం పోలీసు విచారణ జరుగుతోందని అన్నారు. తన రెండు సినిమాలు ఒకే సమయంలో రావడానికి ప్రధాన కారణం కూడా ఈ లీకేజీ సమస్యే అని ఆయన క్లారిటీ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి బ్లాక్ మెయిల్ సంఘటనలు ఎదుర్కోవడం నిజంగా బాధాకరమని చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు.. మొత్తానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఒక మంచి అవుట్‌పుట్‌తో ‘విష్ణు విన్యాసం’ ద్వారా ప్రేక్షకులను పలకరించిన శ్రీవిష్ణు ధైర్యాన్ని ఫ్యాన్స్ అభినందిస్తున్నారు.






