సంప్రదాయ దుస్తుల్లో రెబల్ స్టార్‌ ప్రభాస్‌.. పోటీపడ్డ అభిమానులు

by Disha Web Desk |
సంప్రదాయ దుస్తుల్లో రెబల్ స్టార్‌ ప్రభాస్‌.. పోటీపడ్డ అభిమానులు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తిరుమల శ్రీవారిని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దర్శించుకున్నారు. తిరుపతిలో మంగళవారం ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ప్రభాస్ సోమవారం రాత్రి తిరుమల చేరుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన రెబల్ స్టార్‌ ప్రభాస్‌కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దగ్గరుండి స్వామి వారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ప్రభాస్‌ను ఆశీర్వదించగా ఆలయ అధికారులు పట్టువస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇకపోతే తమ అభిమాన నటుడిని చూసిన అభిమానులు ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. యంగ్ రెబల్ స్టార్ అంటూ అభిమానులు సందడి చేశారు. షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు సైతం ఎగబడ్డారు. ఈ ఆదిపురుష్ సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి హాజరుకానున్న సంగతి తెలిసిందే.

Read More... ‘ఆదిపురుష్’ టికెట్ రేట్స్ పెరగనున్నాయా?





Next Story

Most Viewed