- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూపర్ స్టార్‌ను కలిసిన మూవీ డైరెక్టర్.. ఆయన ఎలాంటి వారో ఈరోజే అర్థమైందంటూ ఆసక్తికర ట్వీట్
ఒకప్పటి హీరోయిన్ సిమ్రాన్(Simran), శశి కుమార్, మిథున్‌జై శంకర్, యోగిబాబు, కమలేష్ జగన్(Kamalesh Jagan) కీలక పాత్రలో నటించిన మూవీ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’(Tourist family).

దిశ, సినిమా: ఒకప్పటి హీరోయిన్ సిమ్రాన్(Simran), శశి కుమార్, మిథున్‌జై శంకర్, యోగిబాబు, కమలేష్ జగన్(Kamalesh Jagan) కీలక పాత్రలో నటించిన మూవీ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’(Tourist family). అయితే ఈ సినిమా అభిషన్ జివింత్ దర్శకత్వంలో తెరకెక్కించగా..యువరాజ్ గణేశన్, నజేరధ్ పసిలియన్ నిర్మించారు. అయితే ఈ చిత్రం ఇటీవల థియేటర్స్‌లో విడుదలై ఊహించని విధంగా హిట్ సాధించింది. అంతేకాకుండా ఎంతోమంది తమిళ, తెలుగు సినీ ప్రముఖు ప్రశంసలు అందుకుంది. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా, అభిషన్ జివింత్ సూపర్ స్టార్ రజినీకాంత్‌ను కలుసుకున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ట్విట్టర్ ద్వారా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘‘నేను సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానో నాకు ఈ రోజే అర్థమైంది. రజినీకాంత్ నా పేరు పిలిచి నన్ను గట్టిగా హత్తుకోగానే ఒళ్లంతా పులకరించిపోయింది. ఆయన నవ్వు చూస్తే చిన్నప్పుడు నేను చేసిప ప్రార్థనలన్నీ ఆలస్యంగా నా దగ్గరికి వచ్చినా, సరిగ్గా నాకు కావాల్సినప్పుడే వచ్చాయనిపించింది. ఆయన ఎంత మంది మనిషి అనేది ఈరోజు పూర్తిగా తెలుసుకున్నాను. రజినీకాంత్ ఎంత నిరాడంబరంగా ఉంటారు’’ అని రాసుకొచ్చాడు. అలాగే ఆయనతో కలిసి తీసుకున్న ఫొటోను కూడా షేర్ చేశాడు.






