- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విడాకుల విషయంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన మౌనీరాయ్..!
అంతేకాకుండా వీరిద్దరు విడాకుల విషయంలో వెనక్కి తగ్గినట్లు టాక్. మళ్లీ ఫాలో కావడంతో ఈ జంట కలవబోతున్నారని పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.

దిశ, సినిమా: బాలీవుడ్ నటి మౌనీ రాయ్, వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌ల వైవాహిక జీవితం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో విడాకుల రూమర్స్ వచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరు తాము విడిపోతున్నట్లు ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు. తాజాగా ఒకరినొకరు సోషల్ మీడియాలో మళ్లీ ఫాలో చేసుకోవడం ప్రారంభించారు. విడాకుల ప్రకటన తర్వాత ఇన్ స్టా గ్రామ్‌లో అన్‌ఫాలో చేసుకున్న ఈ మాజీ జంట, ఇప్పుడు మళ్లీ ఫాలో బ్యాక్ చేసుకోవడంతో వీరి బంధంపై నెటిజన్లలో సరికొత్త చర్చ మొదలైంది. మౌనీ రాయ్ తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ నుండి సూరజ్‌తో ఉన్న పాత పెళ్లి ఫొటోలను డిలీట్ చేసిందంటూ సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ వచ్చాయి.
కానీ, అందులో ఎలాంటి నిజం లేదని తేలింది. మౌనీ రాయ్ తన అకౌంట్‌లో పెళ్లి ఫొటోలతో పాటు సూరజ్‌తో కలిసి ఉన్న పాత జ్ఞాపకాలను అలాగే ఉంచింది. మరోవైపు సూరజ్ ప్రొఫైల్‌లో మాత్రం మౌనీకి సంబంధించిన ఒకే ఒక్క ఫొటో ఉంది, అందులోనూ ఆమె ముఖం సరిగ్గా కనిపించడం లేదు. విడాకుల ప్రకటన తర్వాత సూరజ్ అకౌంట్ కొద్దిసేపు కనిపించకుండా పోయి, ఆ తర్వాత మళ్లీ యాక్టివ్ అయ్యింది. ప్రస్తుతం వీరి పాత ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండటంతో, అభిమానులు మౌనీ రాయ్‌కు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా వీరిద్దరు విడాకుల విషయంలో వెనక్కి తగ్గినట్లు టాక్. మళ్లీ ఫాలో కావడంతో ఈ జంట కలవబోతున్నారని పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. మొత్తానికి విడాకుల విషయంలో మౌనీ రాయ్ బిగ్ ట్విస్ట్ ఇచ్చిందనే చెప్పాలి.






