పాన్ ఇండియా మూవీగా వస్తున్న మోహన్ లాల్ 'వృషభ'

by Disha Web Desk 1 |
పాన్ ఇండియా మూవీగా వస్తున్న మోహన్ లాల్ వృషభ
X

దిశ, వెడ్ డెస్క్: నంద కిషోర్ దర్శకత్వంలో మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ తన కొత్త సినిమాను ప్రకటించించారు. ఈ పాన్-ఇండియన్ చిత్రానికి 'వృషభ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా నేడు విడుదల చేసిన ప్రకటన వీడియోలో మోహన్‌లాల్ మాట్లాడుతూ.. ఈ సినిమా స్టార్ హీరోకి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అని అన్నారు. సినిమాలో భావోద్వేగాలు మరియు వీఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉంటాయని తెలిపారు. అదేవిధంగా ప్రేమ, ప్రతీకారం అనే రెండు భావోద్వేగాల మధ్య జరిగే సంఘర్షణ చుట్టూ సినిమా కథ ఉంటుందని అన్నారు. జూలై 9 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అభిషేక్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జుహీ పరేఖ్ మెహతా సినిమాను నిర్మిస్తున్నారు.



Next Story

Most Viewed