సూపర్ స్టార్ ఇంట్లో ఓనమ్ సెలబ్రేషన్స్.. పంచకట్టులో అట్రాక్ట్ చేసిన మోహన్‌లాల్ (వీడియో)

by Disha Web Desk 10 |
సూపర్ స్టార్ ఇంట్లో ఓనమ్ సెలబ్రేషన్స్.. పంచకట్టులో అట్రాక్ట్ చేసిన మోహన్‌లాల్ (వీడియో)
X

దిశ, సినిమా: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తన అభిమానులు, శ్రేయోభిలాషులు, దక్షిణాది ప్రజలకు ఓనమ్ శుభాకాంక్షలు చెప్పాడు. కేరళలో అతిపెద్ద పండుగగా జరపుకునే ఈ వేడుకను త‌మిళ‌నాడు, కర్నాటక ప్రజ‌లు కుడా జరుపుకుంటారు. అయితే మలయాళీ క్యాలెండర్‌లోని మొదటి నెల అయిన చింగం మాసంలో ఈ సెలబ్రేషన్స్ చేసుకోగా.. కేరళ సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయనికి ముడిపడిన పండుగే ఈ ఓన‌మ్‌. పదిరోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు ఈ ఆగ‌ష్టు 20న‌ మొదలై ఈ నెల 31తో ముగియనున్నాయి. ఈ సందర్భంగా ఇళ్ల ఎదుట పుప్పాల అలంకరణలు, కొత్త వస్త్రాలు, విందు భోజనాలతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటోంది. ఈ క్రమంలోనే కేరళ ప్రజలకు ఓన‌మ్ శుభాకాంక్షలు తెలుపుతూ నెట్టింట ఫొటో, వీడియోలు షేర్ చేశాడు మోహన్ లాల్. పంచెక‌ట్టులో ద‌ర్శన‌మిచ్చిన ఆయన ‘ఓన‌మ్ పండగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అంటూ విష్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.


Next Story

Most Viewed