- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారు టాప్ ఎక్కి ఆవేశంతో ఊగిపోతున్న మోహన్ లాల్.. అట్రాక్ట్ చేస్తున్న ‘Rambaan’ టైటిల్ పోస్టర్
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ అభిమానులకు మరో బిగ్ అప్ డేట్ వెలువడింది.

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ అభిమానులకు మరో బిగ్ అప్ డేట్ వెలువడింది. ప్రస్తుతం జోషి డైరెక్షన్‌లో ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి ‘Rambaan’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా మోహన్ లాల్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయగా లుంగీలో దర్శనమిచ్చిన హీరో ఓ చేతిలో గన్, మరో చేతిలో సుత్తి పట్టుకొని కారుపై నిలబడి శ్రతువులను వెటాడేందుకు ఆవేశంతో ఊగిపోతున్నట్లు కనిపించాడు.
ఇక ఈ సాలిడ్ లుక్స్‌ను నెట్టింట షేర్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ‘వన్ అండ్ ఓన్లీ మోహన్‌లాల్ సార్.. బెస్ట్ ఆఫ్ లక్’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఇక చెంబోస్కి మోషన్ పిక్చర్స్, ఐన్‌స్టీన్ మీడియా, నెక్ట్స్‌టెల్ స్టూడియోస్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా కేరళ, యూఎస్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని టైటిల్ లాంఛ్ ఈవెంట్‌లో క్లారిటీ ఇచ్చాడు మోహన్‌లాల్.






