- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జయసుధపై మోహన్ బాబు సీరియస్! (వీడియో)
మంచు మోహన్ బాబు తీరు మరోసారి వివాదాస్పదం అయింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: మంచు మోహన్ బాబు తీరు మరోసారి వివాదాస్పదం అయింది. ఇవాళ అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకల్లో బీజేపీ నేత, టాలీవుడ్ సీనియర్ నటి జయసుధ పట్ల ఆయన వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వేడుకల్లో మోహన్ బాబు, జయసుధ పక్క పక్కనే కూర్చొని ఉన్నారు. జయసుధ తన చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని చూస్తున్నారు. ఇంతలో ఉన్నట్టుండి మోహన్ బాబు జయసుధ చేతిలో ఉన్న మొబైల్‌ను లాక్కునే ప్రయత్నం చేశారు. మోహన్ బాబు పనికి తొలుత షాక్ తిన్న జయసుధ ఆ వెంటనే తేరుకుని చిరునవ్వుతో సైలెంట్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా వేడుకల సందర్భంగా అక్కినేని విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
- Tags
- Mohan Babu
Next Story






