- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముంబై హోటల్‌లో మోడల్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో ఏముందంటే?
హోటల్‌లో మోడల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంబైల్‌లో కలకలం రేపింది..Latest Telugu News

దిశ, వెబ్ డెస్క్: హోటల్‌లో మోడల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంబైల్‌లో కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. అంధేరీ ప్రాంతంలోని ఓ హోటల్‌లో మోడల్ ఆకాంక్ష మోహన్(30) బుధవారం రాత్రి 8 గంటలకు వచ్చింది. ఆ తర్వాత డిన్నర్ కూడా ఆర్డర్ చేసినట్టు తెలుస్తోంది. అయితే గురువారం హౌస్ కీపింగ్ సిబ్బంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా తలుపు తెరవకపోవడంతో.. అనుమానం వచ్చి హోటల్ మేనేజర్ పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మాస్టర్ కీతో గదిని ఓపెన్ చూసి చూడగా.. మోడల్ మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. అక్కడ సూసైడ్ నోట్ కూడా ఉంది. అందులో ''నన్ను క్షమించండి. నా ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదు. నేను సంతోషంగా లేను. నాకు ప్రశాంతత కావాలి'' అని నోట్‌లో రాసినట్టు సమాచారం. పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
సముద్రంలో సోకుల విందు అందిస్తోన్న బోల్డ్ బ్యూటీ లక్ష్మీరాయ్.






