- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మిత్రమండలి’ ట్రైలర్ అప్డేట్.. ఆసక్తికర పోస్టర్‌తో హైప్ పెంచిన మూవీ మేకర్స్
టాలీవుడ్ హీరో ప్రియదర్శి(Priyadarshi), నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిత్రమండలి’.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో ప్రియదర్శి(Priyadarshi), నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిత్రమండలి’. ఈ సినిమాతో సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ నిహారిక ఎన్‌ఎమ్(Niharika NM) హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. విజయేందర్ దర్వకత్వంలో తెరకెక్కుతుండగా.. సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ మెహరా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన టీమ్ వరుస ఈవెంట్లు నిర్వహించడంతో పాటు అప్డేట్స్‌ను రిలీజ్ చేస్తూ ఆసక్తిని పెంచుతున్నారు.
ఈ నేపథ్యంలో.. తాజాగా, చిత్రబృందం ప్రమోషన్స్‌లో భాగంగా ‘మిత్రమండలి’ అప్డేట్ రాబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ అక్టోబర్ 7న ఉదయం 11:07 గంటలకు రాబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఇందులో ఓ ఇద్దరు దేవుడి గెటప్‌లో అన్ని నగలు, కిరీటం, బాణం పట్టుకుని కనిపంచగా.. ప్రియదర్శి, ప్రసాద్ బెహరా షాక్ అవుతూ పరుగెత్తుతున్నట్లు ఉన్నారు. ఇక నిహారిక మాత్రం బ్లూ కలర్ ఫ్రాక్ ధరించి సూపర్ ఎక్జైట్‌మెంట్‌తో నవ్వుతూ ఓ బ్లూ కలర్ జెండా పట్టుకుని కనిపించింది. ఈ పోస్ట్‌కు ‘‘సరదా & మ్యాడ్‌నెస్‌కి ఆకాశమే హద్దుగా ఉండబోతుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మిత్రమండలి ట్రైలర్ మీ ముందుకు రాబోతుంది. మీ దీపావళిని వెలిగించడానికి ఈ బృందం సిద్ధంగా ఉంది!’’ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ‘మిత్రమండలి’ చిత్రంపై హైప్ పెంచుతోంది.






