- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'మిస్టర్ కింగ్'ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు: మేకర్స్
శరణ్ కుమార్, శశిధర్ చావలి దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'మిస్టర్ కింగ్'.

దిశ, సినిమా: శరణ్ కుమార్, శశిధర్ చావలి దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'మిస్టర్ కింగ్'. హన్విక క్రియేషన్ బ్యానర్‌పై బి.ఎన్.రావు నిర్మించారు. యశ్విక నిష్కల, ఊర్వీ సింగ్ హీరోయిన్లుగా నటించారు. మణిశర్మ సంగీతంలో పాటలన్నీ సూపర్ హిట్ అవగా.. టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ నెల 24న మూవీ విడుదలకాబోతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించగా నరేష్, నిర్మాత ఎంఎస్ రాజు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
ఈ మేరకు మాట్లాడిన నరేష్.. 'శరణ్‌కి పెద్దలు కృష్ణ, విజయ నిర్మలగారి ఆశీస్సులున్నాయి. ఈ సినిమా శరణ్‌కి మంచి భవిష్యత్‌ని ఇస్తుందని నమ్ముతున్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్' అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే ఈ సినిమా ట్రైలర్ చాలా ప్రామెసింగా ఉందన్న నిర్మాత రాజు కొత్త కాన్సెప్ట్‌లా అనిపిస్తోన్న సినిమా పెద్ద విజయం సాధించాలన్నాడు. చివరగా అందరూ థియేటర్లో తమ మూవీ చూసి ఎంజాయ్ చేయాలని నటీనటులు కోరగా రవి కిరణ్, అంజలి, శ్వేత, శ్రీనివాస్, తన్వీర్ తదితరులు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు.
Also Read...
వాస్తవాన్ని వెంటాడుతూ గతం చేసిన యుద్ధమే 'వీరఖడ్గం': మారిశెట్టి సునీల్






