- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను అత్యంత ఇష్టపడే భారతీయ సెలబ్రిటీ ఆయనే.. మిస్ వరల్డ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
2021 మిస్ వరల్డ్ కరోలినా బిలావ్‌స్కీ ఇండియన్ యాక్టర్ షారుఖ్ యాక్టింగ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

దిశ, సినిమా : 2021 మిస్ వరల్డ్ కరోలినా బిలావ్‌స్కీ ఇండియన్ యాక్టర్ షారుఖ్ యాక్టింగ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. జీ20 సదస్సులో భాగంగా తొలిసారిగా అంతర్జాతీయ అందాల పోటీ విజేతలకు శ్రీనగర్ ఆతిథ్యం ఇస్తుండగా.. పోలాండ్‌కు చెందిన ప్రపంచ సుందరి కరోలినాతోపాటు అనేక మంది అందాల పోటీల విజేతలు శ్రీనగర్ నగరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె.. మిస్ వరల్డ్ వంటి ఈవెంట్‌ను నిర్వహించడానికి ఇదే ఉత్తమ ప్రదేశం అని అభిప్రాయపడింది. ఇక్కడి ప్రకృతి సోయగాలు చూసి ముగ్దురాలిని అయ్యానని చెప్పింది. అలాగే ఇండియన్ కల్చర్‌తోపాటు సినీ తారలను పొగిడేస్తూ.. ‘అత్యంత ఇష్టపడే భారతీయ సెలబ్రిటీలలో షారుఖ్ ఒకరు. అన్నీ కలిసొస్తే అతనితో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నా. అలాగే సాజిద్ నడియాడ్‌వాలాను కలిసే అవకాశం రావడం ఆనందంగా ఉందని, త్వరలోనే సంజయ్ లీలా భన్సాలీతో వర్క్ షేర్ చేసుకునే ఛాన్స్ ఉంది' అని చెప్పుకొచ్చింది.






