‘‘తొమ్మిది గ్రంధాలూ వాడికి దొరికితే ప‌విత్ర గంగ‌లో పారేది ర‌క్తమే’’.. అంచనాలను పెంచేసిన ‘మిరాయ్’ ట్రైలర్

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-18 14:14:38  IST  )

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా(teja sajja) పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

‘‘తొమ్మిది గ్రంధాలూ వాడికి దొరికితే ప‌విత్ర గంగ‌లో పారేది ర‌క్తమే’’.. అంచనాలను పెంచేసిన ‘మిరాయ్’ ట్రైలర్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా(teja sajja) పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మంచు మనోజ్, శ్రియ శరణ్, జగపతి బాబు, జయరామ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న.. ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదల కాబోతుంది.

దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రబృందం వరుస అప్డేట్స్ ఇస్తూ హైప్ పెంచుతున్నారు. అంతేకాకుండా ప్రేక్షకుల దృష్టిని ఆకర్శించేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, ‘మిరాయ్’ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. 3 నిమిషాల ట్రైల‌ర్‌లో.. ఈ సినిమా క‌థేమిట‌న్నది టీజ‌ర్‌లోనే చెప్పారు. ట్రైల‌ర్ లో మ‌రింత క్లారిటీ ఇవ్వడంతో పాటు చాలా పాత్రలను పరిచయం చేశారు. ఇందులో హీరో కిందపడుతూ కనిపించగా.. ''ఈ ప్రమాదం ప్రతీ గ్రంధాన్నీ చేరబోతోంది. దాన్ని ఆప‌డానికి నువ్వు మిరాయ్‌ని చేరుకోవాలి. నువ్వు అనుకొంటున్న మ‌నిషీ అడ్ర‌స్సు నేను కాదు. ఈ దునియాలో ఏదీ నీది కాదు భ‌య్యా.. అన్నీ అప్పే.. ఈ రోజు నీద‌గ్గర‌, రేపు నా ద‌గ్గర‌.. నా గ‌తం.. నా యుద్ధం.. నా ప్రస్తుతం ఊహాతీతం.

తొమ్మిది గ్రంధాలూ వాడికి దొరికితే ప‌విత్ర గంగ‌లో పారేది ర‌క్తం.. ఇదే చ‌రిత్ర... ఇది భ‌విష్యత్తు.. ఇదే మిరాయ్‌..’’ అనే డైలాగ్స్‌తో ఈ సినిమా కథ ఏంటో అర్థమవుతోంది. అలాగే ఇందులోని యాక్షన్స్ సీన్స్, విజువల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో ‘మిరాయ్’పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కాగా.. ఈ సినిమా పురాణాల ప్రకారం అశోక చక్రవర్తి కళింగ యుద్ధం తర్వాత పశ్చాత్తాపంతో తొమ్మిది పవిత్ర గ్రంథాలను సృష్టించాడు. ఈ గ్రాంథాలను కాపాడే సూపర్ యోధాగా తేజ సజ్జా కనిపించబోతున్నాడు. కానీ విలన్ పాత్రల్లో జగపతి బాబు, మంచు మనోజ్ నటించి మెప్పించారు.

Next Story