మంత్రులు వర్సెస్ సెలబ్రిటీలు.. ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్-2 షురూ.. బరిలో ఆరు జట్లు!

by Mallepaka Hamsa |

‘ఎలైట్ క్రికెట్ లీగ్ (ECL) సీజన్-2’(Elite Cricket League - Season 2) జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం బందరు రోడ్డులోని వివంతా హోటల్‌లో ఘనంగా జరిగింది.

మంత్రులు వర్సెస్ సెలబ్రిటీలు.. ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్-2 షురూ.. బరిలో ఆరు జట్లు!
X

దిశ, సినిమా: చామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మార్చి నెలలో విశాఖపట్నం వేదికగా నిర్వహించనున్న ‘ఎలైట్ క్రికెట్ లీగ్ (ECL) సీజన్-2’(Elite Cricket League - Season 2) జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం బందరు రోడ్డులోని వివంతా హోటల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి(Ramprasad Reddy), కొండపల్లి శ్రీనివాస్(Kondapalli Srinivas), వాసంశెట్టి సుభాష్, బుల్లితెర నటుడు ప్రభాకర్(Prabhakar) ముఖ్య అతిథులుగా విచ్చేసి, టోర్నమెంట్ జెర్సీలను లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 నమూనాను ఆదర్శంగా తీసుకుని ఈ లీగ్ నిర్వహించడం స్ఫూర్తిదాయకమన్నారు.

గత 18 నెలలుగా రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ... సైనికుల సంక్షేమం కోసం చామల ఫౌండేషన్ చేస్తున్న కృషిని అభినందించారు. ఈ సీజన్‌లో ‘పొలిటికల్ టీమ్’ కూడా పాల్గొంటుందని, యువ మంత్రుల జట్టు కచ్చితంగా కప్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చామల ఫౌండేషన్ ఛైర్మన్ చామల ఉదయ్ చందర్ రెడ్డి మాట్లాడుతూ.. గతేడాది హైదరాబాద్‌లో సీజన్-1 విజయవంతమైందని, ఇప్పుడు విశాఖలో ఆరు జట్లతో సీజన్-2 నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ టోర్నమెంట్ ద్వారా వచ్చే నిధులను సైనికుల సంక్షేమానికి, బంగారు కుటుంబాల అభివృద్ధికి వినియోగిస్తామని ఆయన వివరించారు.

* ఆంధ్ర పొలిటికల్ కింగ్స్

* టాలీవుడ్ థండర్స్

* బుల్లితెర రేంజర్స్

* మీడియా మాస్టర్స్

* శిరి ఇన్ఫో మిస్సైల్స్

* పోలీస్ లయన్స్

Next Story