- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్‌గా మంత్రి మల్లారెడ్డికి ఆఫర్.. (వీడియో)
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొన్న డైరెక్టర్ హరీష్ శంకర్ తన ఇంటికి వచ్చి గంట సేపు కూర్చుని తనతో మాట్లాడారని చెప్పారు. ‘‘అన్నా.. మల్లన్న నీది ఇంతగానం నడుస్తుంది. రెండు రాష్ట్రాల్లో నీదే హవా.. పవన్ కళ్యాణ్ సినిమాలో నిన్ను విలన్‌గా పెట్టి తీద్దామనుకుంటున్నాను’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ ఆఫర్ ఇచ్చాడని మల్లారెడ్డి చెప్పారు. అంతేకాకుండా గంటన్నర బతిమాలాడిన విలన్‌గా చేయనని చెప్పాను అంటూ మంత్రి మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. కాగా.. ఇదే విషయాన్ని ‘మేము ఫేమస్’ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా మల్లారెడ్డి చెప్పారు. మంత్రి మల్లారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Next Story






