- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మీటర్’.. ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుంది: కిరణ్
by Vinod kumar |
మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మీటర్’.

X
దిశ, సినిమా: మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మీటర్’. రమేష్ కడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. ఏప్రిల్ 7న విడుదలకానున్న మూవీ నుంచి ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు, టీజర్‌తో అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే థియేట్రికల్ ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు మేకర్స్.
ఈ సందర్భంగా సినిమాను ఉద్దేశించి మాట్లాడిన హీరో.. ‘ఇది మీరు ఊహించినదాని కంటే డబుల్ ట్రిపుల్ మాస్‌గా ఉంటుంది. అసలు సిసలైన కమర్షియల్ ఎంటర్‌టైనర్. 75 రోజుల పాటు రేయింబవళ్లు కష్టపడి షూట్ చేశాం. పెద్ద సినిమా అవుతుందని వంద శాతం నమ్మకం ఉంది. ప్రేక్షకులు, అభిమానులు, దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, మీడియా.. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు’ అని తెలిపాడు.
Next Story






