- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మాస్ జాతర’ నుంచి వచ్చేసిన మెలొడి సాంగ్.. ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న లిరిక్స్
మాస్ మహారాజ రవితేజ(raviteja), శ్రీలీల (sreeleela) కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’(mass jathara).

దిశ, సినిమా: మాస్ మహారాజ రవితేజ(raviteja), శ్రీలీల (sreeleela) కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’(mass jathara). ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘ధమాకా’ బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. ఇప్పుడు మరోసారి జంటగా నటించారు. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పలు వాయిదాల తర్వాత అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం ఇందులోని అప్డేట్స్ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఓలే ఒలే పాట ప్రశంసలతో పాటు విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా, ‘మాస్ జాతర’ నుంచి హుడియో.. హుడియో అని సాగే మెలొడి పాటను రిలీజ్ చేశారు. ఇక ఇందులో శ్రీలీల చీరలో దర్శనమిచ్చి.. కళ్లకు కాటుకతో మెస్మరైజ్ చేస్తోంది. ఈ పాట లిరిక్స్ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తున్నాయి. భీమ్ సిసిరోలియో మ్యూజిక్ అందించగా.. హేశం అబ్దుల్ వాహాబ్ ఆలపించారు. ఇక ఆ పాటను చూసిన నెటిజన్లు సూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే మళ్లీ బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు.






