Mehreen Pirzada: నిరంతర వేధింపులు.. డబ్బులిచ్చి మరీ అలా చేయిస్తున్నారంటూ మెహరీన్ షాకింగ్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-16 06:12:24  IST  )

టాలీవుడ్ హీరోయిన్ మెహరీన్ పిర్జాదా(Mehreen Pirzada) పెళ్లి చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Mehreen Pirzada: నిరంతర వేధింపులు.. డబ్బులిచ్చి మరీ అలా చేయిస్తున్నారంటూ మెహరీన్ షాకింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ మెహరీన్ పిర్జాదా(Mehreen Pirzada) పెళ్లి చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. హరియాణాకు చెందిన భవ్యా బిష్ణోయ్‌(Bhavya Bishnoi)తో మెహరీన్ నిశ్చితార్థం చేసుకోగా.. పలు కారణాల వల్ల పెళ్లి రద్దు అయింది. ఆ తర్వాత నుంచి సాయి ధరమ్ తేజ్‌తో ప్రేమలో ఉందన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత పెళ్లి చేసుకోబోతున్నట్లు పుకార్లు వచ్చాయి. గత రెండేళ్లుగా మెహరీన్ పెళ్లి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల అవి మరింత పెరిగాయి. అయినప్పటికీ ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న ఆమె తప్పుడు వార్తలు రాసే వారిపై ఫైర్ అయింది. తాజాగా, మెహరీన్ ట్విట్టర్ ద్వారా షాకింగ్ పోస్ట్ పెట్టింది. ‘‘ఈ రోజుల్లో ఎలాంటి పర్యవసానాలు లేకుండా తప్పుడు సమాచారం ఎలా వ్యాపిస్తుందో చూస్తే వింతగా అనిపిస్తుంది.

ఇక డబ్బు తీసుకుని రాసే పనికిమాలిన ఆర్టికల్స్ విషయంలో జర్నలిజం ఖచ్చితంగా దెబ్బతింది. నేను ఈ విషయంపై 2 సంవత్సరాలుగా మౌనంగా ఉన్నాను. కానీ నిరంతర వేధింపుల కారణంగా ఈ రోజు మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. ఓ ఛానల్ నా గురించి ఒక ఆర్టికల్ ప్రచురించింది. అందులో నేను మాకు తెలియని, ఎప్పుడూ కలవని ఎవరో XYZ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని రాశారు. స్పష్టంగా, ఎవరో ఒక నీచుడు నా వికీపీడియాను హ్యాక్ చేసి, రెండు నిమిషాల పాపులారిటీ కోసం ఇలా చేశాడు. కాబట్టి నేను ఇక్కడ అసలు నిజాన్ని స్పష్టం చేస్తున్నాను. నాకు ఎవరితోనూ పెళ్లి కాలేదు.

నన్ను నమ్మండి, నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ విషయం ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేస్తానని మీకు వాగ్దానం చేస్తున్నాను! మీ పద్ధతులు మార్చుకోండి. మీరు జర్నలిస్ట్ వృత్తికి దూరం అవ్వా్ల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ఆ హోదాకు అర్హులు కారు. నా పేజీని గుర్తు తెలియని వ్యక్తులు ఎడిట్ చేయడాన్ని ఆపాలి. నా జీవితం గురించిన సమాచారానికి నేనే అత్యంత కచ్చితమైన ఆధారం’’ అని రాసుకొచ్చింది. దీంతో పెళ్లి పుకార్లకు చెక్ పడినట్లు అయింది. link


Next Story