నా ఫస్ట్ క్రష్ అతనే.. ఆ ఫొటో అపురూపంగా దాచుకున్నా

by Disha Web |
నా ఫస్ట్ క్రష్ అతనే.. ఆ ఫొటో అపురూపంగా దాచుకున్నా
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మేఘా ఆకాశ్ తన ఫస్ట్ క్రష్‌ ఎవరో చెప్పేసింది. అంతేకాదు తన కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. త్వరలోనే ‘రావణాసుర’, ‘మనుచరిత్ర’తో ప్రేక్షకుల మందుకు రాబోతున్న నటి.. తెలుగు రాకపోవడంతో ‘లై’ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా భయందోళనకు గురయ్యానని చెప్పింది. అయితే ఆ సినిమా డైరెక్టర్ సాయం చేయడంతో సులభంగా సినిమా పూర్తి చేశానంది. ‘చిన్నప్పటి నుంచి నేను సిగ్గరినే. నలుగురితో ధైర్యంగా మాట్లాడలేను. మొదట్లో ప్యాకెట్ మనీకోసం చిన్నచిన్న ప్రకటనలు చేశా. అలా సినిమా అవకాశాలు దక్కించుకున్నా. రజనీ సార్‌కు పెద్ద అభిమానిని. ‘పేట’లో అవకాశం వచ్చినపుడు నా ఆనందానికి హద్దులు లేవు. ఎగిరి గంతులేశా. ఇక నా మొదటి క్రష్ క్రికెటర్ ఎం.ఎస్ ధోనినే. ఇప్పటికీ అతడినే ఆరాధిస్తా. అతనితో దిగిన ఫొటోను అపురూపంగా దాచుకున్నా. నా చుట్టూ ఎంతమంది ఉన్నా.. అమ్మ లేకపోతే ఒంటరిగానే ఫీల్ అవుతా’ అంటూ వివరించింది.

ఇవి కూడా చదవండి :

అవకాశాల కోసమేనా ఈ గ్లామర్ షో? రెచ్చిపోతున్న స్టార్ నటిNext Story