- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమిళ సినిమాలో గెస్ట్ రోల్‌లో మేఘా ఆకాష్.. స్పెషల్ ప్రకటన చేసిన మూవీ మేకర్స్
తెలుగులో లై, డియర్ మేఘ(Dear Megha), రాజా రాజా చోర వంటి చిత్రాలతో మేఘా ఆకాష్ మంచి గుర్తింపును దక్కించుకుంది.

దిశ, సినిమా: తెలుగులో లై, డియర్ మేఘ(Dear Megha), రాజా రాజా చోర వంటి చిత్రాలతో మేఘా ఆకాష్ మంచి గుర్తింపును దక్కించుకుంది. కానీ ఒక్క హిట్ కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయింది. దీంతో తమిళ ఇండస్ట్రీకి చెక్కేసింది. స్టార్ హీరోల చిత్రాల్లో విభిన్న పాత్రలో నటిస్తూ.. తన పాపులారిటీని పెంచుకుంటోంది. ఈ రెండు ఇండస్ట్రీల్లో అమ్మడుకి పెద్దగా కలిసి రానప్పటికీ హిట్ ఫ్లాప్ అని ఆలోచించకుండా.. తనకు వచ్చిన అవకాశాలను చేజిక్కించుకుంటోంది. తాజాగా, మేఘా ఆకాష్(Megha Akash) ఓ బంపర్ ఆఫర్ అందుకుంది. తమిళ కామెడీ మూవీ ‘అరో మలై’ సినిమాలో ఆమె గెస్ట్ రోల్‌లో కనిపించనుంది. నేడు మేఘా పుట్టినరోజు కావడంతో మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేస్తూ విషెస్ తెలిపారు. ‘‘మేఘా ప్రత్యేకమైన రోజు సందర్భంగా.. శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే ‘అరోమలై’ (Aaromaley )చిత్రంలో ఆమెను అతిధి పాత్రలో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ అని వెల్లడించారు. సారంగ్ థ్యాగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కిషన్ దాస్, వివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. హర్షనాథ్ ఖాన్, వీటీవీ గణేష్ కీలక పాత్రలో కనిపించనుండగా.. మిని పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 7న థియేటర్స్‌లోకి రానుంది.






