దుబాయ్‌లో మెగాస్టార్ చిన్న కూతురు.. తన పరిస్థితి వివరిస్తూ అలాంటి పోస్ట్‌ పెట్టి షాకిచ్చిన శ్రీజ

by Mallepaka Hamsa |

మా క్షేమం కోరి ఫోన్లు, మెసేజ్‌లు చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా..

దుబాయ్‌లో మెగాస్టార్ చిన్న కూతురు.. తన పరిస్థితి వివరిస్తూ అలాంటి పోస్ట్‌ పెట్టి షాకిచ్చిన శ్రీజ
X

దిశ, సినిమా: గత మూడు రోజులుగా అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలో గల్ఫ్ దేశాలపై డ్రోన్ దాడులు, గాల్లోనే వాటిని అడ్డుకుంటున్న సమయంలో వినిపిస్తున్న భారీ శబ్దాలు అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, శ్రీజ(Sreeja Konidela) తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తాను కూడా దుబాయ్‌లో క్షేమంగా ఉన్నట్లు తెలుపుతూ.. ‘‘మేము దుబాయ్‌లో సురక్షితంగా ఉన్నాము. మా క్షేమం కోరి ఫోన్లు, మెసేజ్‌లు చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీ ప్రేమ మాకు ఎంతో ఊరటనిచ్చింది. ఇక్కడ అంతా ప్రశాంతంగా ఉంది, త్వరలోనే శాంతి నెలకొనాలని కోరుకుంటున్నాను’’ అని ఆమె రాసుకొచ్చారు. తన పిల్లలు నివృత్తి, నావిష్కలతో కలిసి తాను సురక్షితంగా ఉన్నట్లు భరోసా ఇచ్చారు. అయితే, ఈ పోస్ట్‌లలో శ్రీజ ఇచ్చిన మరో హింట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఆమె తన స్టోరీలో బుర్జ్ ఖలీఫా, దుబాయ్ స్కైలైన్ ఫోటోను షేర్ చేస్తూ.. ‘‘మేము ఈ దేశాన్ని ఎంచుకున్నాము, మేము దీనికే కట్టుబడి ఉంటాము’’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే, శ్రీజ తన పిల్లలతో కలిసి శాశ్వతంగా దుబాయ్‌లో స్థిరపడినట్లు అర్థమవుతోంది. గతంలో ఆమె హైదరాబాద్‌లోనే ఉండేవారు, కానీ ఇప్పుడు దుబాయ్‌ను తన సొంత దేశంగా భావిస్తుండటం సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. ఈ ఒక్క పోస్ట్‌తో శ్రీజ కొణిదెల తన పిల్లలతో కలిసి దుబాయ్‌లో స్థిరపడినట్లు స్పష్టమవుతోంది. యుద్ధ భయాల మధ్య తాను సురక్షితంగా ఉన్నానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కేవలం క్షేమ సమాచారం మాత్రమే కాకుండా, దుబాయ్ దేశం పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ అక్కడి జెండా, సూర్యోదయం ఫోటోలను షేర్ చేశారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా షాక్ అవుతున్నారు. ఆమె ఒక్కతి అక్కడ ఏం చేస్తుందంటూ అంతా పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.

Next Story