'ఫస్ట్ డే ఫస్ట్ షో' కోసం మెగాస్టార్ సపోర్ట్

by Disha Web Desk 7 |
ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం మెగాస్టార్ సపోర్ట్
X

దిశ, సినిమా : వంశీధర్, లక్ష్మీ నారాయణ సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఫస్ట్ డే ఫస్ట్ షో'. 'జాతి రత్నాలు' వంటి భారీ హిట్‌ చిత్రానికి దర్శకత్వం వహించిన అనుదీప్ కేవీ కథ అందించగా.. శ్రీకాంత్ రెడ్డి, సంచిత జంటగా నటించారు. సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు మేకర్స్.

ఇదే క్రమంలో ఈ నెల 31(బుధవారం)న ప్రీరిలీజ్ ఈవెంట్‌ నిర్వహిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అంతేకాదు ఈ వేడుకకు లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా వస్తున్నట్లు ఓ వీడియోను కూడా రిలీజ్ చేసింది. ఇక కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో హీరోయిన్ పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌కు పెద్ద ఫ్యాన్‌. 'ఖుషి' సినిమా ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో టికెట్లు కావాలని తన బాయ్‌ఫ్రెండ్‌ను అడుగుతుంది. ఆ టికెట్లు సంపాదించడం కోసం హీరో ఏం చేశాడన్నదే మిగిలిన కథ.

Next Story

Most Viewed