ఓటీటీలోకి రాబోతున్న మెగాస్టార్ సినిమా.. ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే?

by Mallepaka Hamsa |

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty) ‘తనియవర్త్’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చారు. ఇక ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటించిన ఆయన స్టార్ హీరోగా మారాడు.

ఓటీటీలోకి రాబోతున్న మెగాస్టార్   సినిమా.. ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే?
X

దిశ, సినిమా: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty) ‘తనియవర్త్’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చారు. ఇక ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటించిన ఆయన స్టార్ హీరోగా మారాడు. ఎన్నో హిట్ మూవీస్ చేసిన ఆయన మలయాళ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్‌ను దక్కించుకున్నారు. ఇప్పటికీ వరుస చిత్రాల్లో నటిస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. ఇక ఇటీవల మమ్ముట్టి ‘బజూకా’ (Bazooka)సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీని దీనో డెన్నిస్ దర్శకత్వం వహించగా.. థియేటర్ ఆఫ్ డ్రీమ్స్, వై నాట్ స్టూడియోస్ బ్యానర్స్‌పై డేవిన్ కురియకోస్, జిను వి అబ్రహం, విక్రమ్ మెహ్రా, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్(Siddharth Anand Kumar) సంయుక్తంగా నిర్మించాయి.

అయితే ఇందులో గౌతమ్ వాసుదేవ్ మీనన్(Gautam Vasudev Menon) కీలక పాత్రలో నటించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదలై ప్రేక్షకులను అలరించింది. తాజాగా, ‘బజూకా’ డిజిటల్ స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ సినిమా విడుదలైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీ హక్కులను ప్రముఖ సంస్థ జీ5 సొంతం చేసుకోగా జూలై 10నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన మెగాస్టార్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.

link

Next Story