మెగాస్టార్ VS సూపర్ స్టార్.. బరిలో గెలిచేదెవరు!

by Disha Web Desk 6 |
మెగాస్టార్ VS సూపర్ స్టార్.. బరిలో గెలిచేదెవరు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆగస్టు 10 న సూపర్ స్టార్ రజినీ కాంత్ జైలర్ తో 11న మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ తో వస్తున్నారు. సూపర్ స్టార్ పోటీ పడుతున్న మెగాస్టార్ ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోలేదు. భోళా శంకర్ ఇచ్చిన కిక్ తో ఉన్నారు. అయితే సడన్ గా జైలర్ ట్రైలర్ మెగా ఫాన్స్ ని కొంచెం టెన్షన్ పెడుతుందంటున్నారు నెటిజన్స్. ఒకరు సూపర్ స్టార్ రజినీ కాంత్, మరొకరు మెగా స్టార్ చిరంజీవి ఈ ఇద్దరి సినిమా ఒక్క రోజు గాప్ లొనే బాక్సాఫీస్ వద్ద ఢీ కొడుతున్నాయి.రోబో తరువాత సరైన హిట్ లేని రజినికాంత్ గ్రాఫ్ పడిపోయింది.

గతంలో 50 కోట్లు ఈజీగా కలెక్ట్ చేసిన సూపర్ స్టార్ 10 కోట్లు రాబట్టడమే గగనం అయిపోయింది.మెగాస్టార్ కూడా ఆ మధ్య ప్లాపుల్లో ఉన్న వాల్తేరు వీరయ్య తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు.జైలర్ హిట్ రజిని కాంత్ కు చాలా అవసరం. తెలుగులో పోయిన ఇమేజ్ మళ్ళీ దక్కాలంటే జైలర్ తో సక్సస్ చూడాల్సిందే. బీస్ట్ ప్లాప్ తర్వాత నెల్సన్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో డైరెక్టర్ వైపు నుంచి కూడా పెద్ద హైప్ లేదు.అయితే జైలర్ ట్రైలర్ వీటన్నింటి పటాపంచలు చేసి అంచనాలను పెంచేసింది. భోళా శంకర్ ట్రైలర్ చూసిన తర్వాత మెహర్ రమేష్ కు ఫస్ట్ హిట్ వస్తుందని,మెగాస్టార్ వాల్తేరు సక్సెస్ ను కంటిన్యూ చేస్తారు అన్న నమ్మకం కుదిరింది.రజినీకాంత్ సినిమా వస్తున్న పెద్దగా పట్టించుకోని ఆడియన్స్ కు జైలర్ ట్రైలర్ కిక్ ఇచ్చింది.

చాలా కాలం తర్వాత సూపర్ స్టార్ నుంచి మంచి ట్రైలర్ కట్ రావడం దీంతో పాటు కావాలయ్యా సాంగ్ కూడా హిట్ కావడంతో జైలర్ కు హైప్ ఓ రేంజ్ లో క్రియేట్ అయింది. అయితే రజినీ కాంత్ చిరంజీవి తో పోటీ పడాల్సొస్తున్న మెగాస్టార్ సినిమాకు హైప్ ఉన్న కథ తో ఆకట్టుకున్న సినిమా బాక్సాఫీస్ ని గెలుచుకుంటుంది. రజిని మూవీ కి హిట్ టాక్ వచ్చి చాలా సంవత్సరాలు అయింది.ఒకవేళ వస్తే ఎంతటి హీరోన్నైనా ఢీ కొడతాడు.చెల్లి సెంటిమెంట్ తో వస్తున్న భోళాశంకర్ మెప్పిస్తే కాసుల వర్షాన్ని కురిపిస్తుంది. అయితే ఒక్క రోజు గాప్ లొనే రిలీజ్ అవుతున్న ఈ సినిమాలకు మెగాస్టార్ VS సూపర్ స్టార్ అని సరదాగా కామెంట్స్ చేసున్నారు ఫాన్స్.

Next Story

Most Viewed