- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కళ్యాణ్ హెల్త్ అప్డేట్ ఇచ్చిన మెగాస్టార్.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ పోస్ట్
కళ్యాణ్ బాబుకు వైద్య ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షేమంగా, నిలకడగా ఉంది.

దిశ, సినిమా: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి కీలక అప్‌డేట్ ఇచ్చారు. గత కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కోలుకుంటున్న తీరుపై చిరంజీవి చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శుక్రవారం అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే స్పందించిన సిబ్బంది ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం, శనివారం సాయంత్రం వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. పవన్ అస్వస్థత వార్త తెలియగానే అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సినీ పరిశ్రమలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.
పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసైనికులు ఆందోళన చెందుతున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ అందరికీ ధైర్యాన్ని ఇచ్చారు."కళ్యాణ్ బాబుకు వైద్య ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షేమంగా, నిలకడగా ఉంది. ఆయన వేగంగా కోలుకుంటున్నారు. వైద్యుల సమాచారం ప్రకారం, ఆయన మళ్ళీ తన సాధారణ పనుల్లో నిమగ్నం కావడానికి సుమారు వారం రోజులు పట్టవచ్చు. కాబట్టి అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని చిరంజీవి పేర్కొన్నారు.అంతేకాకుండా, పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు మనోధైర్యం లభించాలని, పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. మెగాస్టార్ ఇచ్చిన ఈ స్పష్టతతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మరికొద్ది రోజుల్లోనే పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రంలోకి మళ్ళీ వస్తారని ఆశిస్తున్నారు.






