అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన మెగాస్టార్.. నా కళ్లు ఆనందంతో తడిసిపోయాయంటూ ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty) ఇప్పటికీ వరుస చిత్రాల్లో నటిస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తూ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు.

అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన మెగాస్టార్.. నా కళ్లు ఆనందంతో తడిసిపోయాయంటూ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty) ఇప్పటికీ వరుస చిత్రాల్లో నటిస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తూ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. గత ఏడాది రెండు ప్రాజెక్ట్స్‌తో వచ్చినప్పటికీ హిట్ సాధించలేకపోయారు. ఇక ఇటీవల డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్(Dominic and the Lady's Purse), బజూకా వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద అంతగా మెప్పించలేకపోయాయి. అయినప్పటికీ మమ్ముట్టి హిట్, ఫ్లాప్ అని ఆలోచించకుండా వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు. త్వరలో ‘కలమ్‌కావల్’ (Kalamkaval)సినిమాతో రాబోతున్నట్లు అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశాడు. ఈక్రమంలోనే ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు పలు వార్తలు వచ్చాయి. దీంతో ఆయన అభిమానులంతా ఆందోళన చెందారు.

అయినప్పటికీ మమ్ముట్టి మాత్రం సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. కానీ ఆయన ఫ్రెండ్ ఓ స్టార్ హీరో మాత్రం ఓ ఇంటర్వ్యూలో భాగంగా మమ్ముట్టికి అనారోగ్య సమస్యలు వచ్చినట్లు తెలిపాడు. ఇక ఈ సంగతి తెలుసుకున్న వారంతా ఆయన ఎప్పుడెప్పుడు కోలుకుని మళ్లీ ఇండస్ట్రీకి వస్తారా? అని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, మమ్ముట్టి అభిమానులకు గుడ్ న్యూస్ వెల్లడించారు. ఆయన మళ్లీ షూటింగ్ సెట్‌లో పాల్గొనబోతున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించనప్పటికీ ప్రముఖ నిర్మాత ఆంటో జోసెఫ్ ఇన్‌స్టా ద్వారా వెల్లడించాడు.

‘‘మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నా కళ్లు ఆనందంతో తడిసిపోయాయి. నా కోసం ప్రార్థించిన.. నాకు ఏం కాదంటూ నన్ను ఓదార్చిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాపై అపారమైన ప్రేమను కురిపించిన వారందరు ఒకపై సపోర్ట్‌గా ఉంటారని ఆశిస్తున్నాను’’ అని రాసుకొచ్చారు. అంతేకాకుండా మమ్ముట్టి ఫొటోను షేర్ చేశారు. దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు లెజెండ్స్ ఎప్పుడూ అలసిపోరు వెల్కమ్ బ్యాక్ కొత్త ఇన్నింగ్స్‌తో బాక్సాఫీసును షేక్ చేయాలని కామెంట్లు చేస్తున్నారు.

Next Story