- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనిల్ రావిపూడి బర్త్ డేకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన మెగాస్టార్..
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) పుట్టినరోజు సందర్భంగా.. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) గారు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

దిశ, సినిమా: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) పుట్టినరోజు సందర్భంగా.. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) గారు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడికి ఒక అందమైన వాచ్‌ని గిఫ్ట్‌గా అందించారు. కేక్ కట్ చేసి బర్త్ డేని సెలబ్రేట్ చేశారు. చిరంజీవి గారు ఇచ్చిన ఈ సర్ప్రైజ్ గిఫ్ట్, హృదయపూర్వక శుభాకాంక్షలు అనిల్ రావిపూడికి మోస్ట్ మోమరబుల్ మూమెంట్స్‌గా నిలిచాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ (Mana Shankara Varaprasad Garu)తెరకెక్కుతోంది. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ ‘మీసాల పిల్ల’ రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ క్రాస్ చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలుగు సినిమా మ్యూజిక్‌కి కొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేసింది. సాహూ గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్న ‘మన శంకరవర ప్రసాద్ గారు’ 2026 సంక్రాంతికి గ్రాండ్‌గా విడుదల కానుంది.






