ఆ డైరెక్టర్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన Megastar Chiranjeevi..??

by Disha Web Desk 7 |
ఆ డైరెక్టర్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన Megastar Chiranjeevi..??
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, దర్శకుడు బాబీ డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా 'వాల్తేరు వీరయ్య'. సంక్రాతి కానుకగా అభిమానుల ముందుకొచ్చిన ఈ మూవీ అతి తక్కువ సమయంలోనే రూ. కోట్లలలో వసూళ్లు రాబట్టి ఘన విజయం సాధించింది. ఈ క్రమంలోనే చిరంజీవి డైరెక్టర్ బాబీకి కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.

'వాల్తేరు వీరయ్య' సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో చిరంజీవి.. డైరెక్టర్ బాబీకి తన ఇంట్లో స్పెషల్ విందును ఏర్పాటు చేశాడట. అంతేకాకుండా దాదాపు రూ. 2 కోట్ల విలువ చేసే కారుని బాబీకి గిఫ్ట్‌గా ఇచ్చారంట చిరంజీవి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం జోరుగా వైరల్ అవుతుంది. అయితే దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కానీ ఏమీ లేవు. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే.. మెగాస్టార్ లేదా బాబీని స్పందిచాల్సి ఉంటుంది.

READ MORE

ప్రేమలో అత్యంత కష్టమైన విషయం ఏమిటి? శ్రద్ధ ప్రశ్న వైరల్



Next Story

Most Viewed