- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొదటిసారి ఆ పాత్రలో నటించనున్న Megastar Chiranjeevi!
మెగాస్టార్ చిరంజీవి-కల్యాణ్ కృష్ణ కలయికలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి-కల్యాణ్ కృష్ణ కలయికలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు చిరు చిన్న కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మాతగా వ్యవహరించనుంది. ఈ చిత్ర షూటింగ్ ఆగస్టు నుంచి స్టార్ట్ అవ్వనుందని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ మూవీలో చిరు పాస్ పోర్ట్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగిగా కనిపిస్తాడని సమాచారం. మెగాస్టార్ ఇలాంటి పాత్రలో మొదటిసారిగి నటిస్తున్నారు. తన క్యారెక్టర్ క్లాసీ లుక్‌తో సాగబోతుందని తెలుస్తోంది. కాగా, ఇంకో విషయమేంటంటే.. బ్రో డాడీ సినిమాకు ఇది రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ, ఇది పూర్తిగా కొత్త కథనే అంటున్నారు కొంతమంది నెటిజన్లు. ఇక ఈ మూవీలో త్రిషను కథానాయికగా ఎంపిక చేసుకున్నారట.
Also Read: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో BRO సినిమా టీషర్ట్స్!
Next Story






