నాకు క్యాన్సర్ వచ్చింది.. మెగాస్టార్ చిరంజీవి షాకింగ్ కామెంట్స్

by Disha Web Desk 2 |
నాకు క్యాన్సర్ వచ్చింది.. మెగాస్టార్ చిరంజీవి షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి షాకింగ్ న్యూస్ చెప్పారు. తాను క్యాన్సర్ బారిన పడ్డానని చెప్పారు. చికిత్స చేయించుకోవడంతో దాని బారి నుంచి బయటపడ్డానని తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదని, ముందుగా గుర్తించడంతోనే తాను బతికానన్నారు. క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే పెద్ద జబ్బుకాదన్నారు. శనివారం ఓ ఆసుపత్రి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తాను గతంలో క్యాన్సర్ బారిన పడిన విషయాన్ని రివీల్ చేశారు. ఈ విషయాన్ని చెప్పడానికి తాను భయపడటం లేదని చెప్పారు. ఎప్పుడూ ఫిట్‌గా ఉంటూ హెల్దీ ఫుడ్ తీసుకునే తనకు ఏ జబ్బు రాదనే ఓ భావన తనలో ఉండేదని అయినప్పటికీ తనకు క్యాన్సర్ ఎటాక్ చేసిందన్నారు. కొలనోస్కీపీ చేయించుకోవడం ద్వారా తనకు ఈ విషయం తెలిసిందన్నారు. ఎవరూ తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఎవరికీ డాక్టర్ల అవసరం రావద్దనే కోరుకుంటున్నట్లు చెప్పారు. కాగా ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటే చిరంజీవి తనకు క్యాన్సర్ ఎటాక్ చేసిందనే విషయం వెల్లడించడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read more: 'బ్రో' షూటింగ్ లో అదిపోయే అప్డేట్

Tapsee pannu :కర్లీ హెయిర్.. డీప్ వాటర్.. బికినీ‌లో తాప్సీ అందాల విందు

Next Story

Most Viewed