పవన్ కల్యాణ్ ఆస్తులపై కన్నేసిన టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరో తెలిస్తే షాక్!

by Disha Web Desk 9 |
పవన్ కల్యాణ్ ఆస్తులపై కన్నేసిన టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరో తెలిస్తే షాక్!
X

దిశ, సినిమా: ప్రస్తుతం పవర్‌‌స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. రాజకీయాల్లో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. టీడీపీతో పొత్తు ఏర్పాటు చేసుకున్న పవన్ భారీ ఎత్తున గెలిచేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ ఆస్తులను సైతం అమ్ముకునేందుకు కూడా రెడీ అయ్యాడు. కొద్ది రోజుల క్రితమే ఈ హీరో తన ఆస్తులను అమ్మకానికి పెట్టాడంటూ.. పవన్ ఆస్తులకు సరైన డబ్బు ఇచ్చే వారు దొరికితే అమ్మేందుకు సిద్ధంగా ఉన్నాడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.

అయితే పవన్ ఆస్తులను కొనేందుకు ఓ స్టార్ హీరో మొగ్గుచూపుతున్నాడంటూ నెట్టింట టాక్ వినిపిస్తుంది. మరీ ఆ హీరో ఎవరో కాదు.. పవన్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి అట. పవర్ స్టార్ ఇప్పుడు ఆస్తులన్నీ అమ్మితే ఫ్యూచర్‌లో తనకు తన పిల్లలకు ఏమీ లేకుండా అయిపోతుందని మెగాస్టార్ ఆలోచించి.. ఆ ఆస్తులను నీ పేరు మీదే ఉంచుకో ఎంత అమ్ముతావో చెప్పు అంత మనీ నేను నీకు ఇస్తానంటూ పవన్ తో చిరు అన్నారట. కానీ పవర్ స్టార్ ముందుగా ఈ ఒప్పందానికి అంగీకరించలేదట.

దీంతో మెగాస్టార్.. పవన్ కల్యాణ్ తో మాట్లాడేదే లే అని బెదిరించడంతో చివరికి ఈ ఒప్పందాన్ని ఒప్పుకోవాల్సి వచ్చిందట పవన్. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా తమ్ముడి ఆస్తులపై కన్నేశాడుగా మెగాస్టార్ చిరంజీవి అని నెగిటివ్ కామెంట్స్ చేయగా.. మరికొంతమంది మెగా ఫ్యాన్స్.. అన్నదమ్ముల అనుబంధం అంటే ఇలా ఉండాలంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Read More..

జాన్వీ కపూర్ బర్త్ డే స్పెషల్.. RC16 మూవీ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

Next Story