జాన్వీ కపూర్ బర్త్ డే స్పెషల్.. RC16 మూవీ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

by Disha Web Desk 6 |
జాన్వీ కపూర్ బర్త్ డే స్పెషల్.. RC16 మూవీ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్
X

దిశ, సినిమా: నేడు బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ పుట్టిన రోజు మార్చి 6, 1997. ఈ అమ్మడు అతిలోక సుందరి శ్రీదేవి నిర్మాత బోనీ కపూర్ పెద్ద కూతురిగా 2018లో ‘ధడక్‌’ సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరలో హీరోయిన్‌గా చేస్తుంది. ఈ సినిమా నుంచి పోస్టర్లు, గ్లింప్స్ మాత్రమే విడుదలైనప్పటికీ తెలుగులో జాన్వీ కపూర్‌కు ఫుల్ క్రేజ్ వచ్చింది.

అయితే ఈ అమ్మడు రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తున్న RC16లో ఆఫర్ అందుకున్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల బోనీ కపూర్ స్పందించి కన్ఫార్మ్ చేశాడు. దీంతో ఆమె వద్దంటే వద్దు అని మెగా ఫ్యాన్స్ నెట్టింట గోల గోల చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా, నేడు జాన్వీ కపూర్ పుట్టిన రోజు కావడంతో డైరెక్టర్ బుచ్చిబాబు విష్ చేస్తూ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. RC16 నుంచి జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశాడు. దీంతో అది చూసిన మెగా ఫ్యాన్స్ ఆమె తప్ప వేరే హీరోయిన్ దొరకలేదా? అంటూ ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు.


Next Story