ఆ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, యాంకర్ శ్రీముఖి మధ్య రొమాంటిక్ సీన్స్..!

by Disha Web Desk 9 |
ఆ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, యాంకర్ శ్రీముఖి మధ్య రొమాంటిక్ సీన్స్..!
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి గురించి పరిచయం అక్కర్లేదు. తరచూ సోషల్ మీడియాలో ఈ భామ పెళ్లి గురించి వార్తలు వినిపిస్తునే ఉంటాయి. ఆమె వాటికి స్పందించి.. ‘‘ దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయకండి, ప్రస్తుతం నా దృష్టి కెరీర్‌పైనే ఉంది. నాకు ఇప్పుడు వివాహం చేసుకోవాలనే ఆలోచన లేదంటూ’’.. తప్పుడు న్యూస్ రాయొద్దు అని ఖండిచారు. ప్రస్తుతం శ్రీముఖి చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ‘భోళా శంకర్’, అలాగే బాలకృష్ణ, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రాల్లో కనిపించనున్నారని సమాచారం. భోళా శంకర్ మూవీలో మెగాస్టార్‌, శ్రీముఖి మధ్య రొమాంటిక్ సీన్స్ ఉంటాయని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అలాగే బాలయ్య 108వ సినిమాలో ఈ బ్యూటీ కీలక పాత్రలో నటిస్తుందట.

Read more:

జపాన్ లో విడుదల కానున్న రామ్ చరణ్ 'ఆరెంజ్'

Next Story