జపాన్ లో విడుదల కానున్న రామ్ చరణ్ 'ఆరెంజ్'

by Disha Web Desk 1 |
జపాన్ లో విడుదల కానున్న రామ్ చరణ్ ఆరెంజ్
X

దిశ, వబ్ డెస్క్: మెగా, పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'ఆరంజ్' సినిమా 2010 బాక్స్ఆఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయితే, ఈ జనరేషన్ కారణంగా యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది ఆ సినిమా. ఇటీవలే రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ సందర్భంగా ఆరెంజ్ సినిమాను రీరిలీజ్ చేశారు. విడుదైన అన్ని చోట్ల అద్భుతమైన కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు తాజాగా ఈ మూవీ జపాన్‌లో విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జెనీలియా కథానాయికగా నటించింది. ఈ సినిమాలో నాగబాబు, మంజుల, ప్రకాష్ రాజ్, ప్రభు, శ్రీనివాస్ అవసరాల, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. నాగబాబు నిర్మించిన ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతాన్ని సమకూర్చారు.

Also Read...Ram Charan :రామ్ చరణ్ ప్రేమించిన హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Next Story

Most Viewed