కారణజన్ముడు అంటూ ఎన్టీఆర్‌ను స్మరించుకున్న చిరంజీవి

by GSrikanth |   (  Updated:2023-05-29 11:50:17  IST  )

విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నివాళులు అర్పించారు. సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్‌ను స్మరించుకున్నారు.

కారణజన్ముడు అంటూ ఎన్టీఆర్‌ను స్మరించుకున్న చిరంజీవి
X

దిశ, వెబ్‌డెస్క్: విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నివాళులు అర్పించారు. సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్‌ను స్మరించుకున్నారు. ‘‘నూటికో కోటికో ఒక్కరు.. వందేళ్లు కాదు.. చిరకాలం, కలకాలం మన మనస్సులో మిగిలిపోతారు. చరిత్ర వారి గురించి భావితరాలకి గర్వంగా చెబుతుంది. అలాంటి కారణజన్ముడు శ్రీ NTR. తెలుగు జాతి ఘనకీర్తికి వన్నె తెచ్చిన శ్రీ నందమూరి తారక రామారావు గారితో నా అనుబంధం నాకెప్పుడూ చిరస్మరణీయం. రామారావు గారి శతజయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటున్నాను’’ అని మెగాస్టార్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు.

Also Read: ఎన్టీఆర్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ అగ్రగామి: నందమూరి బాలకృష్ణ

Next Story