ప్రతీ పదేళ్లకోసారి బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ ఊచకోత

by Disha Web Desk 2 |
ప్రతీ పదేళ్లకోసారి బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ ఊచకోత
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు మెగాస్టార్ చిరంజీవి. పాలుతాగే పిల్లాడి నుంచి పండు ముసలి వరకు గత 40 ఏళ్లుగా అందరినీ తన సినిమాలతో అలరిస్తున్నాడు. తాజాగా.. వాల్తేరు వీరయ్యతో మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు మెగాస్టార్. కేవలం నాలుగు రోజుల్లోనే 120 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బాస్ ఈజ్ బ్యాక్ అని నిరూపించాడు. అయితే, చిరంజీవికి ఇది కొత్తేం కాదని అభిమానులు నెట్టింట్లో కొత్త చర్చ ప్రారంభించారు. ప్రతీ పదేళ్లకోసారి బాక్సాఫీస్‌ వద్ద బాస్ ఊచకోత కామన్ అని పోస్టులు పెడుతున్నారు. గత ముప్పై ఏళ్లుగా ప్రతీ పదేళ్లకోసారి మెగాస్టార్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారని వివరింగా చెప్పుకొచ్చారు.

1. 1983లో ఖైదీతో బ్లాక్‌బస్టర్

2. 1993లో ముఠామేస్త్రీతో హిట్

3. 2003లో ఠాగూర్‌తో ఇండస్ట్రీ హిట్

4. 2023లో వాల్తేరు వీరయ్యతో పూనకాలు

Also Read...

'సార్' నుంచి మరో సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న 'Banjara'!


Next Story

Most Viewed