నిర్మాతలను బతికించండి: డైరెక్టర్లకు మెగాస్టార్ చిరంజీవి కీలక సూచన

by Disha Web Desk 19 |
నిర్మాతలను బతికించండి: డైరెక్టర్లకు మెగాస్టార్ చిరంజీవి కీలక సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: వాల్తేరు వీరయ్య మూవీ సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. దర్శకులు బాధ్యతతో సినిమాలు తీయాలని సూచించారు. ఖర్చు నియంత్రణలో ఉంచి.. ఇండస్ట్రీలో నిర్మాతలను బతికించాలని చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిర్మాతలు బాగుంటేనే చిత్ర పరిశ్రమ బాగుంటుందన్నారు. వాల్తేరు వీరయ్య సినిమా కోసం ప్రతి ఒక్కరూ కష్టపడ్డారని.. వారందరి కృషి వల్లే సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యిందన్నారు. డైరెక్టర్ బాబీ చివరి వరకు సినిమాను చెక్కుతూనే ఉన్నాడని కొనియాడాడు. బాబీ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఈ సినిమాకు ఓకే చెప్పానని తెలిపారు. ఇక, చిరంజీవి, శృతిహాసన్, రవితేజ ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ వాల్తేరు వీరయ్య.. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 13వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed