- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘స్పిరిట్’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి.. క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా
స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి చిత్రాలతో బాక్సాఫీసును షేక్ చేశారు.

దిశ, సినిమా: స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి చిత్రాలతో బాక్సాఫీసును షేక్ చేశారు. ఇక ఇప్పుడు ‘స్పిరిట్’ (Spirit)సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)హీరోగా నటిస్తుండగా.. వివేక్ ఒబేరాయ్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ప్రభాస్ పక్కన దీపికా పదుకొణెను హీరోయిన్‌గా తీసుకోగా.. డైరెక్టర్‌తో గొడవల కారణంగా ఈ బిగ్ ప్రాజెక్ట్ నుంచి ఆమెను తొలగించారు. ఇందుకు కారణం 8పని గంటలను కోరడంతో పాటు పలు కండీషన్లు పెట్టినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
ఈ విషయంపై సందీప్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు. అలాగే దీపికా స్థానంలో త్రిప్తి డిమ్రిని హీరోయిన్‌గా ఫైనల్ చేశారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ఇంకా షూటింగ్ ప్రారంభించుకోని ‘స్పిరిట్’ చిత్రానికి సంబంధించిన వార్తలెన్నో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ తండ్రి పాత్రలో నటిస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి.
తాజాగా, ఓ చిట్‌చాట్‌లో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగా ఈ వార్తలకు చెక్ పెట్టారు. ‘‘చిరంజీవి గారు ‘స్పిరిట్’ సినిమాలో భాగం కాబోతున్నారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇందులో ఆయన నటించడం లేదు. కానీ నేను ఆయన ఫ్యాన్ కాబట్టి మెగాస్టార్‌తో ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. తప్పకుండా చేస్తాను. కానీ అది ‘స్పిరిట్’ మాత్రం కాదు. తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి’’ అని తెలిపారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ అభిమానుల్లో తీవ్ర నిరాశ కనిపిస్తోంది.






