Bholaa Shankar Trailer : పవన్ కల్యాణ్ డైలాగ్‌తో చిరు వీరంగం (వీడియో)

by Disha Web Desk 2 |
Bholaa Shankar Trailer :  పవన్ కల్యాణ్ డైలాగ్‌తో చిరు వీరంగం (వీడియో)
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి అప్‌కమింగ్ ఫిల్మ్ భోళా శంకర్. ఈ చిత్రానికి మెహెర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తుండగా.. మహానటి కీర్తి సురేశ్ చిరు చెల్లెలి పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్‌కు, పోస్టర్స్‌కు, టీజర్‌కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా.. ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. అమ్మాయిల మిస్సింగ్ కేసును ఛేధించే హీరోగా మెగాస్టార్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. రంగస్థలంలో రామ్ చరణ్ తండ్రిని మించిన యాక్టింగ్‌ అంటూ తమన్నా చెప్పిన డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. అంతేగాక, చివర్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మేనరిజాన్ని చిరంజీవి ఇమిటేట్ చేయడం అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తుందని చెప్పాలి. మొత్తంగా ట్రైలర్ అభిమానుల్లో ఆసక్తి రేపింది. కాగా, ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు 11న విడుదల కానుంది.

Next Story

Most Viewed