- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుడ్ న్యూస్ ప్రకటించిన మెగాస్టార్.. ఎమోషనల్ ట్వీట్ వైరల్.. ఉపాసనకు కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
మెగా కోడలు ఉపాసన(Upasana) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

దిశ, సినిమా: మెగా కోడలు ఉపాసన(Upasana) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆమె సినిమాల్లో నటించనప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఓ వైపు కూతురు క్లిన్‌కారా బాధ్యతలు చూసుకుంటూనే బిజినెస్‌లు రన్ చేస్తోంది. తాజాగా, ఉపాసన రాష్ట్ర స్పోర్ట్స్ హబ్‌కు కో-ఛైర్‌పర్సన్‌గా తెలంగాణ ప్రభుత్వం ఉపాసనను నియమించింది. ఈ విషయాన్ని తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టారు. ‘‘మా కోడలు ఉపాసన ఇప్పుడు తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌కు కో-ఛైర్‌పర్సన్‌గా గౌరవప్రదమైన పదవిలో నియమించడం సంతోషంగా ఉంది.
ఇది గౌరవం అనడం కంటే కూడా బాధ్యతను పెంచిందని చెప్పాలి. ఉపాసన నీకున్న నిబద్ధత, ఫ్యాషన్‌తో క్రీడల్లో దాగి ఉన్న అపార ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తారని, ప్రతిభావంతులను అగ్ర స్థాయిలో నిలబెట్టడానికి తగిన విధి విధానాలను రూపొందించడంలో నీ వంతు కృషి చేస్తావని ఆశిస్తున్నాను. సదా నీకు దేవుడు దీవెనలు ఉంటాయని భావిస్తున్నాను’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు మెగా కోడలికి కంగ్రాట్స్ చెబుతున్నారు.






