నదిలో సగం మునిగి బ్రహ్మచారిని పూజ చేసిన నిహారిక..! పోస్ట్ వైరల్

by Disha Web Desk 6 |
నదిలో సగం మునిగి బ్రహ్మచారిని పూజ చేసిన నిహారిక..! పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ఇటీవల తన భర్త జొన్నలగడ్డ చైతన్యకు విడాకులు ఇచ్చి విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించి అందరికీ షాకిచ్చింది. అలాగే విడాకుల తర్వాత తన ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ పలు ఫొటో షూట్స్‌కు సంబంధించిన ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది. తాజాగా, నిహారిక చీరలో ఉండి బ్రహ్మచారిని పూజ చేసింది. దీనికి సంబంధించిన ఫొటలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దివ్య జ్ఞానం పొందే ప్రయత్నం చేస్తుంది. అందుకు బ్రహ్మచారిణి దేవత పూజలో బిజీగా ఉంది. తెల్ల చీర కట్టుకుని నీట కొలనులో మునుగుతుంది. పుణ్యస్నానం ఆచరిస్తూ పూజలు నిర్వహించింది. అంతకు ముందు సాదువులా మారి షాకిచ్చింది. ప్రస్తుతం నిహారిక పెట్టిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో అవి చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Next Story

Most Viewed