వైట్ బికినీలో రెచ్చిపోయిన మెగా హీరోయిన్.. ఫేమ్ కోసమే బాడీ పార్ట్స్ చూపిస్తున్నావంటూ నెటిజన్ల బోల్డ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

వైట్ బికినీలో రెచ్చిపోయిన మెగా హీరోయిన్.. ఫేమ్ కోసమే బాడీ పార్ట్స్ చూపిస్తున్నావంటూ నెటిజన్ల బోల్డ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు ‘లక్ష్మి కళ్యాణం’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత మెగా హీరోలు రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, చిరంజీవిలతో నటించి పలు హిట్స్ అందుకుంది. తెలుగు, తమిళ భాషల్లో నటించిన ఈ భామ విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుని గత కొన్నేళ్ల నుంచి స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో రాణిస్తోంది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే గౌతమ్ కిచ్లును ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. అయినప్పటికీ కాజల్ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉంది. ఇటీవల సికందర్ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది.

ప్రస్తుతం మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ‘కన్నప్ప’(Kannappa) లో కాజల్ కీలక పాత్రలో నటిస్తోంది. ముఖేష్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాజల్ వరుస సినిమాలతో ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు ఫొటోలు షేర్ చేస్తోంది. ఇక ఇటీవల తన పుట్టిన రోజు కావడంతో ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌ను వెళ్లింది. అక్కడ బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న కాజోల్ వైట్ కలర్ బికినీ ధరించి బాడీ పార్ట్స్ చూపిస్తూ హాట్ షో చేసింది. అలాగే నీటిలో పడుకొని అమ్మడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు జనాల అటేన్షన్, ఫేమ్ కోసమే బాడీ పార్ట్స్ చూపిస్తున్నావ్ కదా.. అని కొందరు కామెంట్లు పెట్టగా.. మరికొందరు మాత్రం ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు.

Instagram link

Next Story